ట్రంప్ హోటళ్లను ఆసుపత్రులుగా మార్చాలి: అమెరికన్ నటి

ABN , First Publish Date - 2020-03-27T05:16:08+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ అనే పేరుతో ఉన్న హోటళ్లను కరోనా పేషంట్ల చికిత్స కోసం ఆసుపత్రులుగా మార్చాలంటూ అమెరికన్ నటి

ట్రంప్ హోటళ్లను ఆసుపత్రులుగా మార్చాలి: అమెరికన్ నటి

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ అనే పేరుతో ఉన్న హోటళ్లను కరోనా పేషంట్ల చికిత్స కోసం ఆసుపత్రులుగా మార్చాలంటూ అమెరికన్ నటి అలిస్సా మిలానో పిలుపునిచ్చారు. ముఖ్యంగా ట్రంప్ స్వస్థలమైన న్యూయార్క్‌లో ఉన్న హోటళ్లను వెంటనే ఆసుపత్రులుగా మార్చాలని సూచించారు. ‘ట్రంప్‌కు అమెరికాలో ఎన్ని హోటళ్లు ఉన్నాయి? ముఖ్యంగా న్యూయార్క్‌లో ఎన్ని ఉన్నాయి? కరోనా అదుపులోకి వచ్చేంత వరకు ఆ హోటళ్లను ఆసుపత్రులుగా మార్చాలి. మనకు ప్రస్తుతం బెడ్స్ లోటు ఉంది’ అని అలిస్సా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 


ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌లోని అనేక బిల్డింగ్‌లపై ట్రంప్ అనే పేరు ఉన్నప్పటికి.. అవన్నీ ట్రంప్ సొంతం అని చెప్పడానికి లేదు. వీటిలో ట్రంప్‌కు ఎంత వాటా ఉన్నది, ఎంత హక్కు ఉన్నది తెలియదు. ట్రంప్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్ ప్రకారం.. న్యూయార్క్‌లో కేవలం ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ఒక్కటే వర్కింగ్ హోటల్‌గా ఉంది. న్యూయార్క్‌తో పాటు వాషింగ్టన్ డీసీ, మియామి, లాస్ వెగాస్, చికాగో తదితర రాష్ట్రాలలో ట్రంప్‌కు హోటళ్లు ఉన్నాయి. వేరే దేశాల విషయానికి వస్తే స్కాట్లాండ్, ఐర్లాండ్, కెనడాలలో హోటళ్లను నడుపుతున్నారు. అయితే తన హోటళ్లను ఆసుపత్రులుగా మార్చనున్నట్టు ట్రంప్ చెప్పకపోయినప్పటికి.. తాను న్యూయార్క్ ప్రజల కోసం ఎంతో సాయం చేస్తున్నట్టు ఇటీవల తన ట్విటర్ ఖాతాలో ట్రంప్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-03-27T05:16:08+05:30 IST