Abn logo
Sep 22 2020 @ 21:22PM

జగన్‌కు అమిత్‌ షా క్లాస్‌!

Kaakateeya

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు కేంద్రమంత్రి అమిత్‌ షా క్లాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై అమిత్‌షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వ తీరు సరిగా లేదని అమిత్‌ షా అన్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షాతో జగన్‌ భేటీ  అసంపూర్తిగా ముగిసింది.  బుధవారం ఉదయం మరోసారి కలవాలని జగన్‌కు అమిత్‌ షా చెప్పి పంపినట్లు సమాచారం. దీంతో బుధవారం ఉదయం 10.30కు అమిత్‌షాను జగన్‌ మరోసారి కలవనున్నారు. అమిత్‌షా సమక్షంలో పీఎంవో ఉన్నతాధికారి కేకే మిశ్రాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అమరావతి భూములు, ఫైబర్‌నెట్‌, అంతర్వేది వ్యవహారాలపై సీబీఐ విచారణకు అంగీకరించాలని కేకే మిశ్రాకు జగన్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement