Oct 27 2021 @ 10:53AM

నిర్మాతగా అమలాపాల్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

సౌత్ బ్యూటీస్ లో అమలాపాల్ చాలా ప్రత్యేకం. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైపోకుండా..  కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ లోనూ నటిస్తూ బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకుంటున్నారు. ఏహీరోయిన్ కూడా చేయడానికి సాహసించని పాత్రలతో మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమలాపాల్ ఇప్పుడో వెరైటీ పాత్రతో రాబోతున్నారు. ఆ తమిళ సినిమా పేరు కడావర్. ఇందులో ఆమె కథానాయికగా నటించడంతో పాటు.. సొంతనిర్మాణంలో సినిమా రూపొందిస్తున్నారు. అమలాపాల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలుపుతూ.. పోస్టర్ ను రివీల్ చేశారు.



అమలా పాల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 12 ఏళ్ళు అయిన విషయాన్ని రివీల్ చేస్తూ.. ఈ పన్నెండేళ్లల్లో తాను చాలా ఎదిగానని .. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మారుతున్నానని, ‘కడావర్’ మూవీతో  కొత్తగా ప్రొడక్షన్ హౌస్  మొదలుపెట్టానని తెలిపారు. ఇందులో అమల.. పోలీస్ సర్జెన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్ట్ మార్టమ్ టేబుల్ పై శవం ఉండగా.. దానిపై ఫ్లాస్క్ ఆ పక్కన అమలాపాల్ టిఫిన్ చేస్తున్న లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అనూప్ యస్ పానికర్ ఈ సినిమాకి దర్శకుడు. సీరియల్ కిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. మొన్నామధ్య మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఫోరెన్సిక్ మలయాళ మూవీ తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని థ్రిల్ చేయబోతోంది.