Abn logo
Aug 10 2020 @ 09:52AM

బోల్డ్ వెబ్ సిరీస్‌లో అమ‌లాపాల్‌..!

మ‌న స్టార్స్ అంద‌రూ డిజిట‌ల్ రంగం వైపు అడుగులేస్తున్నారు. ఈ వ‌రుస‌లో ఇప్పుడు హీరోయిన్ అమ‌లాపాల్ కూడా చేరారు. తెలుగు, త‌మిళ చిత్రాల్లో డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను ఎంచుకుని న‌టిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్స్‌లో అమలాపాల్ ఒక‌ర‌న‌డంలో సందేహం లేదు. అమ‌లాపాల్‌ గ‌త చిత్రం ‘ఆమె’ కూడా వివాదాల న‌డుమే విడుద‌లైంది. ఇప్పుడు కూడా అమ‌లాపాల్ ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం. మ‌హేష్ భ‌ట్‌, జియో స్టూడియోస్ ఈ వెబ్ సిరీస్‌ను హిందీలో నిర్మిస్తున్నార‌ట‌. త‌మిళంలో రాసిన పాపుల‌ర్ న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని స‌మాచారం. 

Advertisement
Advertisement
Advertisement