వాటర్‌బేస్ అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ఎంపీ అనురాధ

ABN , First Publish Date - 2021-10-19T18:07:44+05:30 IST

భారతదేశంలో ష్రిప్ అక్వాకల్చర్‌లో పురోగామి అయిన వాటర్‪బేస్ లిమిటెడ్ సంస్థ ఏడాది పొడవునా రొయ్యల పెంపకం విజయవంతంగా సాగించడానికి అవసరమైన ఉత్తమనాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించడంపై దృష్టిపెట్టింది

వాటర్‌బేస్ అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ఎంపీ అనురాధ

అమలాపురం: భారతదేశంలో ష్రిప్ అక్వాకల్చర్‌లో పేరుగాంచిన వాటర్‪బేస్ లిమిటెడ్ సంస్థ ఏడాది పొడవునా రొయ్యల పెంపకం విజయవంతంగా సాగించడానికి అవసరమైన ఉత్తమనాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించడంపై దృష్టిపెట్టింది. ఈ సంస్థ తన తొలి ప్రత్యేక కాన్సెప్ట్ అవుట్‪లెట్ ‘ష్రింప్ వరల్డ్’ను తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నెలకొల్పింది. ఈ వాటర్‪బేస్ ష్రింప్ వరల్డ్‌ను అమలాపురం ఎంపీ చింతా అనూరాధ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ పొన్నాడ, అమలాపురం మునిసిపల్ ఛైర్‪పర్సన్ సత్యనాగేంద్ర మణి, రొయ్య రైతులు పాల్గొన్నారు. ఈ అవుట్‌లెట్ ద్వారా రొయ్య సాగుకు కావాల్సినవన్నీ ఒకేచోట దొరకడంపై ప్రజాప్రతినిధులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. వాటర్‪బేస్ సంస్థ అత్యధిక నాణ్యత కలిగిన సీడ్, ఫీడ్ ఉత్పత్తులను, ఫామ్‌కేర్ పరిష్కారాలని అందిస్తోంది. ఈ కంపెనీ రైతు బంధు అనే రైతుస్నేహ కార్యక్రామన్నికూడా నిర్వహిస్తోంది. విత్తనం నుంచి పంట చేతికందేదాకా అన్ని అంశాల్లో మద్దతునిచ్చి, ఒత్తిడిలేకుండా సాగు చేసే అవకాశాన్ని కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వాటర్‌బేస్ సీఈవో రమాకాంత్ ఆకుల తెలిపారు. రొయ్యల రిటైల్ విభాగంలో ఈ ప్రారంభం ఓ కొత్త మైలురాయిగా ఉండబోతోందన్నారు. 


ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అనురాధ మాట్లాడుతూ.. ‘‘అమలాపురం రొయ్యలసాగుకి ప్రసిద్ధి చెందిన పట్టణం. వాటర్‪బేస్ ష్రింప్ వరల్డ్ ప్రారంభోత్సవంలో పాలు పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. రొయ్య రైతుల అవసరాలన్నీ ఒకేచోట తీర్చడం ద్వారా ఈ దుకాణం రైతులకి సాయపడుతుందని ఆశిస్తున్నాను. రైతులకి మరింత మెరుగ్గా సేవలు అందించడానికి ఈ అవుట్‪లెట్ తెరిచినందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా చిన్నకారు రైతులకి ఇది పెద్ద ఎత్తున సాయపడుతుంది కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను’’ అన్నారు. ఎమ్మెల్యే సతీష్ పొన్నాడ మాట్లాడుతూ.. ఇది ఈ ప్రాతంలో రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, వాటర్‌బేస్ కంపెనీ భవిష్యత్ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-10-19T18:07:44+05:30 IST