రూ.649 కోట్లపై సీఎం, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-08-14T18:49:14+05:30 IST

జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

రూ.649 కోట్లపై సీఎం, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి: దేవినేని ఉమ

అమరావతి: జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.  రూ.1400 కోట్లు సీఎఫ్‌ఎమ్‌ఎస్ ద్వారా డబల్ పేమెంట్ చేశారని  నిన్న దేవినేని ఉమ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎఫ్‌ఎమ్‌ఎస్ పేరుతో ఆర్థిక రీజాయిండర్ ఇచ్చింది. అయితే రీజాయిండర్‌లో పొరపాటున 649 కోట్లు సచివాలయ అకౌంట్‌కు బదిలీ అయ్యాయని ఉమకి పంపిన రీజాయిండర్‌లో  ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఉమ స్పందిస్తూ రాజధాని రైతులకు రూ.186 కోట్లు కౌలుకి అని విడుదల చేసి ఇంతవరకు అకౌంట్‌లో వేయలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు మాత్రం డబుల్ పేమెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. రూ.649 కోట్లు పొరపాటున వెళ్లాయని తనకు పంపిన రీజాయిండర్‌లో పేర్కొన్నారని తెలిపారు. రూ.649 కోట్లపై సీఎం, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-08-14T18:49:14+05:30 IST