రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య పదవి నుంచి తప్పుకోవాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-08-14T15:43:05+05:30 IST

రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ పదవి నుండి

రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య పదవి నుంచి తప్పుకోవాలి: రామకృష్ణ

అమరావతి: రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ పదవి నుండి స్వచ్ఛందంగా తప్పుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రిటైర్డ్ జస్టిస్‌గా చేసిన ఈశ్వరయ్య ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడటం న్యాయవ్యవస్థకే మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు. ఈశ్వరయ్యపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించిందని... జడ్జి రామకృష్ణతో జరిగిన  ఫోన్ సంభాషణల ఆడియో తనదేనని పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య ఒప్పుకోవటం గమనార్హమన్నారు. రిటైర్డ్ జస్టిస్‌గా ఉన్న ఈశ్వరయ్య తప్పుడు పిల్స్ దాఖలు చేయించారనే అభియోగాలు కూడా ఉన్నాయని రామకృష్ణ పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-14T15:43:05+05:30 IST