Abn logo
Mar 11 2021 @ 17:51PM

అమరావతి రైతుల జన జాగృతి జాగరణ కార్యక్రమం

అమరావతి: అమరావతిపై పాలకులు విషంజిమ్ముతున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకైక రాజధాని అమరావతి కోసం చేస్తున్న ఆందోళనలు గురువారానికి 450వ రోజుకు చేరుకున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అమరావతి జన జాగృతి జాగరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆందోళనకారులు తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగువేయమని రైతులు స్పష్టంచేశారు.