మహాపాదయాత్రలో పోలీసుల జులుం: అమరావతి జేఏసీ

ABN , First Publish Date - 2021-12-02T04:24:57+05:30 IST

మహాపాదయాత్రలో తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని అమరావతి జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జీసెస్, అల్లా వాహనాలని...

మహాపాదయాత్రలో పోలీసుల జులుం: అమరావతి జేఏసీ

నెల్లూరు: మహాపాదయాత్రలో తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. జీసెస్, అల్లా వాహనాలను అనుమతించకుండా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.భోజనం చేయడానికి స్థలమిచ్చిన వారినీ బెదిరించారన్నారు. నడిరోడ్డుపై భోజనం చేయాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు.


‘‘అన్నం పెట్టే అన్నదాతకి అన్నం తినే అర్హత లేదా?. కుక్క తోక వంకరలా ప్రభుత్వ తీరు మారడం లేదు. సంఘీభావం తెలపడానికి వచ్చిన అయిదువేల మందికి అన్నం పెట్టాం. అది చూసి కుళ్లుబుట్టి వ్యవహారిస్తున్నారు. రెండున్నరేళ్లలో ఒక్క మంచి పని చేశారా?. పాలకుల్లో ఒక్కరైనా ఒక్క ఎకరా భూమి ఇచ్చారా?. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతాం.’’ అని అమరావతి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 



Updated Date - 2021-12-02T04:24:57+05:30 IST