రైతులను బలి చెయ్యొద్దు

ABN , First Publish Date - 2020-09-25T14:52:07+05:30 IST

తమ త్యాగాలను అవహేళన చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని..

రైతులను బలి చెయ్యొద్దు

మూడు రాజధానులతో ప్రయోజనం ఏమిటో చెప్పండి

282వ రోజుకు చేరిన రైతుల ఉద్యమం  


గుంటూరు(ఆంధ్రజ్యోతి): తమ త్యాగాలను అవహేళన చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు మం డిపడ్డారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేప ట్టిన దీక్షలు గురువారం 282వ రోజుకు చేరు కున్నాయి. పెదపరిమి, తుళ్లూరు, అనంతవరం, దొండపాడు, అబ్బరాజుపాలెం, తుళ్లూరు, మం దడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, ఐనవోలు తదితర రాజధాని గ్రామాల్లో దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ మూడు రాజధానులతో ప్ర యోజనం ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో భూములు అమ్ముకోవటానికే కుట్ర పన్నారని ఆరోపించారు.


ఉన్నత న్యాయస్థానాల్లో రైతులకు తప్పక న్యాయం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. తల్లిలాంటి అమరావతిని నాశనం చేయవద్దని వేడు కున్నారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నీరుకొండ గ్రామాల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆయా కార్యక్రమాల్లో రైతు సంఘ నేతలు మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రకటనను వెంటనే ప్రభుత్వం విరమించుకుని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరారు.  రైతు సంఘ నేతలు ఉమామహేశ్వరరావు, ఎ.కిరణ్‌,  ఎం.సాంబ శివరావు, రమేష్‌, వెంకటేశ్వరరావు, సతీష్‌, అశోక్‌, కుమారి, పద్మ, జ్యోతి, దుర్గారావు, భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామ రైతులు, మహి ళలు నిరసనలు తెలిపారు. పొన్నెకల్లు సీపీఐ గ్రామ  కార్యదర్శి ముప్పాళ్ల శివశంకరరావు మాట్లాడుతూ విజయవాడలోని మెట్రో కార్యా లయాన్ని అధికారులు విశాఖకు తరలించటాన్ని ప్రజలు ఏమని  అర్ధం చేసుకోవాలన్నారు. 


న్యాయవ్యవస్థను ధిక్కరించి ప్రభుత్వం ఇలాంటి పనులు  చేయటం హేయమైన చర్య అన్నారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో  రైతు జేఏసీ నాయకులు, స్థానికులు నిరసన దీక్షలు కొనసాగించారు. ఐకాస నేతలు కళ్లం రాజశేఖర్‌రెడ్డి, ఎం.మాణిక్యాలరావు, సాబ్‌జాన్‌, గుంటక సాంబిరెడ్డి, ఉయ్యూరు శ్రీనుబాబు, చప్పిడి వెంకటేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, ఎం.తాతయ్య, గోగినేని నాగేశ్వరరావు, కడియం నాగరాజు, కళ్లం రామిరెడ్డి స్థానిక రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-09-25T14:52:07+05:30 IST