మూడు ముక్కలాటతో నాశనమే

ABN , First Publish Date - 2020-09-28T17:03:03+05:30 IST

అమరావతితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన పాలకులు దానిని విస్మరించి..

మూడు ముక్కలాటతో నాశనమే

285వ రోజు ఆందోళనల్లో రైతులు 

రైతుల త్యాగాలు మరువలేనివి : ఉమ


తుళ్లూరు, మంగళగిరి క్రైమ్‌, తాడేపల్లి, తాడికొండ: అమరావతితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన పాలకులు దానిని విస్మరించి, మూ డు ముక్కలాటతో ప్రజల భవిష్యత్‌ను నాశనం చేస్తోన్నారని రైతులు ధ్వజ మెత్తారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని వారు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 285వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమాన్ని అవహేళన చేయటమంటే ఆంధ్రులందరినీ కించపరచడమేనన్నారు.  


అమరావతిని ముంచాలనే కుట్ర

అమరావతిని ముంచాలని కుట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. ఆదివారం ఆయన తు ళ్లూరు, దొండపాడు, బోరుపాలెం వెలగపూడి, మందడం గ్రామాల్లోని దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వరదలతో నిండిన ప్రాజెక్టుల నుంచి ఒకేసారి నీటిని విడు దల చేసి అమరావతి ముంపు ప్రాంతం అని చూపించడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. అందుకే స్థాయికి మించి ప్రాజెక్టులలో నీరు నిల్వ ఉంచారని ఆరోపించారు. 

 

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నీరుకొండ గ్రామాల్లో రిలే దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. 285వ రోజు దీక్షల్లో మాజీ జడ్పీటీసీ జయసత్య, రైతు సంఘ నాయకులు ఉమామహేశ్వరరావు, కిరణ్‌, వెంకటేశ్వరరావు, వరకృష్ణ, భీమయ్య, శ్రీను, కొండలరావు, వై భాగ్యా రావు,  దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తాడేపల్లి మండలం పెనుమాకలో దీక్షలు కొనసాగాయి. 285వ రోజు దీక్షలో ఐకాస నాయకులు ముప్పెర సదాశివరావు ఎం మాణిక్యాలరావు, సాబ్‌జాన్‌, దండమూడి సదాశివరావు, మన్నవ వెంకటేశ్వరరావు, ముప్పెర సుబ్బారావు, కళ్లం బ్రహ్మారెడ్డి, పలగాని కృష్ణ, ముప్పెర సాంబశివరావు, పలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


స్వార్ధ ప్రయోజనాలకు సీఎం జగన్మోహనరెడ్డి మూడు రాజధానులని తెర మీదకు తెచ్చారంటూ పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు ఆదివారం నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మూ డు రాజధానుల ఏర్పాటు చేస్తాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 





Updated Date - 2020-09-28T17:03:03+05:30 IST