ఇళ్ల నుంచే అమరావతి దీక్షలు

ABN , First Publish Date - 2020-04-02T09:15:30+05:30 IST

అమరావతి ఉద్యమం ఆగదు అంటూ రాజధాని గ్రామాల రైతులు ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టారు.

ఇళ్ల నుంచే అమరావతి దీక్షలు

106వ రోజుకు చేరిన రాజధాని ఆందోళనలు


తుళ్లూరు/గుంటూరు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): అమరావతి ఉద్యమం ఆగదు అంటూ రాజధాని గ్రామాల రైతులు ఇళ్ల వద్దే దీక్షలు చేపట్టారు. కరోనా నిషేధాజ్ఞలు నేపథ్యంలో బుధవారం 106వ రోజు కూడా ఎక్కడికక్కడ దీక్షలు కొనసాగాయి. మా బతకులు, మా పిల్లల భవిష్యత్తు అ మరావతితోనే అని రాజధాని ప్రాంత గ్రామాల రైతులు తేల్చి చెప్పారు. రాజధాని పరిధిలోని నీరుకొండ, తుళ్లూరు, మందడం, రాయపూడి, అనంతవరం, నెక్కల్లు, పెదపరిమి తదితర గ్రామాల్లో మహిళలు బృందాలుగా ఏర్పడి ఇళ్ల నుంచే నిరసనలు కొనసాగించారు. నీరుకొండ రైతులు గ్రామంలోని పల్నాటి వీరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరం క్రితం వేల సంఖ్యలో పనుల సందడితో ఓ వెలుగు వెలిగిన అమరావతి ప్రాంతం తిరిగి ఆ స్థాయి వెలుగు సంతరించుకోవాలని కోరుతూ రైతులు, మహిళలు ’అమరాతి వెలుగు’ కార్యక్రమాన్ని బుధవారం కూడా నిర్వహించారు.   

Updated Date - 2020-04-02T09:15:30+05:30 IST