May 18 2021 @ 14:02PM

కొవిడ్‌తో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అమరేంద్ర మహంతి క‌న్నుమూత‌

ప్ర‌ముఖ ఒడియా సంగీత ద‌ర్శ‌కుడు, నేప‌థ్య గాయ‌కుడు అమ‌రేంద్ర మ‌హంతి(63) సోమ‌వారం క‌రోనాతో క‌న్నుమూశారు. కొన్ని రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డి ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మహంతి క‌న్నుమూశారు. ఈయ‌న మృతిపై గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. మూడు దశాబ్దాల పాటు ఒరియా సినీ పరిశ్రమలో మహంతి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.