Abn logo
Sep 20 2021 @ 11:59AM

Punjab: సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం

రాహుల్ గాంధీ, సిద్ధూలు హాజరు, అమరీందర్ సింగ్ గైర్హాజరు

చండీఘడ్ : పంజాబ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణస్వీకారం చేయించారు.ఈ ప్రమాణస్వీకారోత్సవానికి  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పంజాబ్ కాంగ్రెస్ అధినేత సిద్ధూలు హాజరు కాగా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ గైర్హాజరు అయ్యారు. కాంగ్రెస్ నేతలు సుఖ్ జిందర్ సింగ్ రంధ్వా, ఓపీ సోనీలు పంజాబ్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు.మొట్టమొదటి దళిత సీఎంగా చన్నీ నిలిచారు. డిప్యూటీ సీఎంలలో ఒకరు జాట్ సిక్కూ మతానికి చెందిన వ్యక్తి ఒకరు, మరొకరు హిందూ వ్యక్తి ఉన్నారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారానికి ముందు రూప్ నగర్ గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption