పెద్దిరెడ్డికి అమర్‌నాథ్‌రెడ్డి కౌంటర్‌

ABN , First Publish Date - 2022-01-08T00:58:47+05:30 IST

మంత్రి పెద్దిరెడ్డికి మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి కౌంటరిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డికి

పెద్దిరెడ్డికి అమర్‌నాథ్‌రెడ్డి కౌంటర్‌

చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డికి మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి కౌంటరిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డికి దమ్ముంటే కుప్పంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అక్రమ కేసులకు బ్రాండ్ అంబాసిడర్ పెద్దిరెడ్డి అని మండిపడ్డారు. నేతలు, కార్యకర్తలు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టిన ఘనత పెద్దిరెడ్డిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే నెంబర్ సీఎం అని డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ఇప్పుడు ఆదాయం లేదని ఎడ్చేది మీరు కాదా? అని అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఉద్యోగుల అడిగిన పీఆర్సీ కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వమని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో భయమెందుకన్నారు. చంద్రబాబుకు గొప్ప పనులు చేయడం మాత్రమే తెలుసని, గొప్పలు చెప్పుకోవడం తెలీదని అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు.

Updated Date - 2022-01-08T00:58:47+05:30 IST