Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమాత్యా.. మాస్కులు మరిచితిరా?!

పోలీసుల సాక్షిగా మాస్కులు ధరించని నేతలు

ఆదిలాబాద్‌, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఒమైక్రాన్‌ వేరియంట్‌తో థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచుకొస్తుందని ప్రభుత్వం పదేపదే హెచ్చరికలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నా.. జిల్లా నేతలు మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం బోథ్‌ మండలం కైలాస్‌టేకిడి శివక్షేత్రాన్ని దర్శించుకున్న నేతలెవరూ మాస్కులు ధరించకుండానే ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. గత వారం క్రితమే రాష్ట్ర ప్రభుత్వం మాస్కు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏకంగా పోలీసుల సాక్షి గా మాస్కులు ధరించకుండానే నేతలు ఫొటోలకు ఫోజులివ్వడంపై పలువురు చర్చించుకుంటున్నారు. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన పోలీసులు ఇలా ప్రేక్షకపాత్ర వహిచండంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. 

Advertisement
Advertisement