అమేజ్‌ఫిట్‌ జిటిఎస్‌ 2 మిని

ABN , First Publish Date - 2020-12-26T07:09:21+05:30 IST

చైనాలో ఈ నెల మొదట్లో విడుదలైన స్మార్ట్‌వాచ్‌ ‘అమేజ్‌ఫిట్‌ జిటిఎస్‌ 2 మిని’ బుకింగ్స్‌ నేటి నుంచి మన దేశంలో ప్రారంభం అవుతున్నాయి. ఎప్పటికీ అమోల్డ్‌ డిస్‌ప్లేకు తోడు హృదయ స్పందనను నిరంతరం తెలుసుకునేందుకు వీలుగా పిపిజి ఆప్టికల్‌ సెన్సర్‌ కూడా ఈ వాచీలో ఉంటుంది...

అమేజ్‌ఫిట్‌ జిటిఎస్‌ 2 మిని

  • నేటి నుంచి బుకింగ్స్‌

చైనాలో ఈ నెల మొదట్లో విడుదలైన స్మార్ట్‌వాచ్‌ ‘అమేజ్‌ఫిట్‌ జిటిఎస్‌ 2 మిని’  బుకింగ్స్‌ నేటి నుంచి మన దేశంలో ప్రారంభం అవుతున్నాయి. ఎప్పటికీ అమోల్డ్‌ డిస్‌ప్లేకు తోడు హృదయ స్పందనను నిరంతరం తెలుసుకునేందుకు వీలుగా పిపిజి ఆప్టికల్‌ సెన్సర్‌ కూడా ఈ వాచీలో ఉంటుంది. ఒత్తిడి, రుతుక్రమం, నాణ్యమైన నిద్రను మానిటర్‌ చేసుకునే వీలు కూడా ఇందులో ఉంది. 50 వరకు ఫేస్‌లతో ఇది లభ్యమవుతుంది. మన దేశంలో ఈ వాచీ ధరను రూ.6,999గా నిర్ణయించారు. ఫ్లెమింగో పింక్‌, మిడ్‌నైట్‌ పింక్‌, సగే గ్రీన్‌ రంగులో లభించే దీని కోసం ఈ రోజు  మధ్యాహ్నం బుక్‌ చేసుకోవచ్చు.  చైనాలో దీని ధర మన రేట్ల ప్రకారం రమారమి రూ.8,000 ఉంది.  అల్యూమినియం లోహ మిశ్రమంతో రూపొందించిన ఈ స్మార్ట్‌ వాచీ బరువు 19.5 గ్రాములు మాత్రమే. అలాగే ఇందులో 70కి మించి ప్రీలోడెడ్‌ స్పోర్ట్స్‌ మోడ్స్‌ కూడా ఉన్నాయి. 

Updated Date - 2020-12-26T07:09:21+05:30 IST