Abn logo
Sep 27 2021 @ 02:48AM

అమెజాన్‌ మరో ఈస్ట్‌ ఇండియా కంపెనీ: ఆరెస్సెస్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 : ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌పై ఆర్‌ఎ్‌సఎస్‌ నిప్పులు చెరిగింది. అది ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ 2.0’లా తయారైందంటూ తమ వారపత్రిక ‘పాంచజన్య’లో కవర్‌ స్టోరీని ప్రచురించింది. ‘‘18వ శతాబ్దంలో భారత్‌ను ఆక్రమించుకోవడానికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ చేసిన పనులనే ఇప్పుడు అమెజాన్‌ కూడా చేస్తోంది’’ అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విధానాలను కంపెనీకి అనుకూలంగా మార్చుకోవడానికి అమెజాన్‌ కోట్లాది రూపాయల ముడుపులు చెల్లించిందని ఆరోపించింది. ఈ సంచిక అక్టోబరు 3న మార్కెట్లోకి విడుదల కానుంది.