మూడు చైనీస్ బ్రాండ్లపై అమెజాన్ నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2021-06-23T10:47:57+05:30 IST

నకిలీ సమీక్షలతో విక్రయానికి పెట్టిన మూడు చైనీస్ బ్రాండు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అమెజాన్ నిషేధాస్త్రం విధించింది...

మూడు చైనీస్ బ్రాండ్లపై అమెజాన్ నిషేధాస్త్రం

న్యూఢిల్లీ : నకిలీ సమీక్షలతో విక్రయానికి పెట్టిన మూడు చైనీస్ బ్రాండు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై అమెజాన్ నిషేధాస్త్రం విధించింది.చైనా దేశంలోని షెన్ జెన్ ఆధారిత ఎలక్ట్రానిక్ కంపెనీ సన్ వాలీ తయారు చేసిన రావ్ పవర్ పవర్ బ్యాంకులు, టాట్రోనిక్స్ ఇయర్ ఫోన్స్, వావా కెమెరాల అమ్మకాలను ఇకామర్స్ దిగ్గజమైన అమెజాన్ జూన్ 16వతేదీ నుంచి నిషేధించింది. చైనా బ్రాండ్ల గురించి సానుకూల సమీక్షలు రాసిన వినియోగదారులకు చైనా వ్యాపారులు బహుమతి కార్డులు అందిస్తున్నారని అమెజాన్ గుర్తించింది. అమెజాన్ సమీక్ష వ్యవస్థను చైనా వ్యాపారులు దుర్వినియోగం చేశారు.


 చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను 2020 నుంచి అమెజాన్ విక్రయిస్తుండేది. నకిలీ కస్టమర్ సమీక్షలతో నిబంధనలను ఉల్లంఘించినందున తాము చైనా బ్రాండ్లపై నిషేధం విధించామని అమెజాన్ తెలిపింది. అమెజాన్ యొక్క ఆన్‌లైన్ మార్కెట్ నుంచి కొన్ని అతిపెద్ద చైనీస్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఉత్పత్తులు  అదృశ్యమయ్యాయి.

Updated Date - 2021-06-23T10:47:57+05:30 IST