Abn logo
Jun 30 2020 @ 20:11PM

దేశంలోని 300కి పైగా నగరాల్లో అందుబాటులోకి వచ్చిన అమెజాన్ ప్యాంట్రీ

న్యూఢిల్లీ: అమెజాన్ ప్యాంట్రీ ఇప్పుడు దేశంలోని 300కు పైగా నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. అలహాబాద్, అమ్రేలీ, బరేలీ, బేతుల్, భోపాల్, భండారా, చురు, దియోగఢ్, గోండా, జమ్ము, ఝాన్సీ, కతువా, కోజికోడ్, మాల్డా, మొరాదాబాద్, నైనిటాల్, పఠాన్‌కోట్, రాజ్‌కోట్, సిమ్లా, ఉదయ్‌పూర్, వారణాసి తదితర నగరాల ప్రజలకు ఇప్పుడు అమెజాన్ ప్యాంట్రీ అందుబాటులోకి వచ్చింది. 


ఇప్పుడీ నగరాల ప్రజలు అమెజాన్‌లో కిరాణా సరుకులను ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే, దేశంలోని 10 వేల పిన్‌కోడ్‌లలో అమెజాన్ ప్యాంట్రీ అందుబాటులోకి వచ్చింది. ఇందులో చిన్న పట్టణాలైన రాజస్థాన్‌లోని భరత్‌పూర్, చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని శివపురి, హర్యానాలోని ఫతేహాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌‌లలోని ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. 


అమెజాన్‌ ప్యాంట్రీని 2016లోనే భారత్‌లో ప్రారంభించింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తూ వస్తోంది. ఇందులో మొత్తం 200 బ్రాండ్ల నుంచి 3వేల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.  

Advertisement
Advertisement
Advertisement