స్టూడెంట్స్ కోసం అమెజాన్ బంపర్ ఆఫర్

ABN , First Publish Date - 2021-07-14T06:40:25+05:30 IST

స్టూడెంట్స్ కోసం అమెజాన్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఆన్‌లైన్ క్లాసులతో ఇన్నాళ్లూ విసిగి వేసారిన విద్యార్థులు, టీచర్లు ఇప్పుడు మళ్లీ స్కూళ్ల బాట..

స్టూడెంట్స్ కోసం అమెజాన్ బంపర్ ఆఫర్

స్టూడెంట్స్ కోసం అమెజాన్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఆన్‌లైన్ క్లాసులతో ఇన్నాళ్లూ విసిగి వేసారిన విద్యార్థులు, టీచర్లు ఇప్పుడు మళ్లీ స్కూళ్ల బాట పడుతున్నారు. ఈ క్రమలోనే ‘బ్యాక్ టూ క్లాసెస్’ పేరిట ఓ అద్భుతమైన సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్ ఈ నేల ఆఖరు(జూల్ 31) వరకు అందుబాటులో ఉండనుంది. ల్యాప్‌ టాప్‌లు, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, ఇతర గాడ్జెట్స్‌పై 50 శాతం వరకు తగ్గింపునిస్తూ సరికొత్త ఆఫర్లను ఈ సేల్ ద్వారా వినియోగదారులకు అమెజాన్ అందిస్తోంది. ఎంపిక చేయబడిన గాడ్జెట్స్‌పై విద్యార్థులకు ఎడ్‌టెక్‌ యాప్స్‌ నుంచి డేటా సైన్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి కోర్సులపై కూడా ఆఫర్లను పొందేందుకు అవకాశం కల్పించింది. 


ప్రధానంగా ల్యాప్‌ట్యాప్‌లపై రూ.10వేల వరకు డిస్కౌంట్‌లను అందిస్తోంది. అలాగే ల్యాప్‌టాప్‌ లేదా టాబ్లెట్‌ కొన్న వారికి వేదాంతు, టాప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, డిజిటల్‌ విద్యా వంటి ఎడ్యుకేషన్‌ యాప్‌లోని ఆన్‌లైన్‌ కోర్సులపై సుమారు రూ.20,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఈ గాడ్జెట్స్‌ను నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ ద్వారా కొనుగోలు చేసేందుకు అమెజాన్ అవకాశం కల్పించింది. 

Updated Date - 2021-07-14T06:40:25+05:30 IST