అమెజాన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2020-10-21T14:11:17+05:30 IST

అమెజాన్ ఉద్యోగులకు ఉద్యోగులకు శుభవార్త...కొవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ దిగ్గజమైన అమెజాన్...

అమెజాన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

2021 జూన్ వరకు  వర్కు ఫ్రం హోం

న్యూఢిల్లీ :  అమెజాన్ ఉద్యోగులకు ఉద్యోగులకు శుభవార్త...కొవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆన్‌లైన్ దిగ్గజమైన అమెజాన్ తన ఉద్యోగులకు 2021 జూన్ 30వతేదీ వరకు వర్కు ఫ్రం హోం చేసేందుకు అంగీకరించింది. ‘‘మా కంపెనీ ఉద్యోగులు 2021 జూన్ 30వతేదీ వరకు ఇంటి నుంచి సమర్థవంతంగా పనిచేసేందుకు మేం అనుమతిస్తున్నాం’’ అని అమెజాన్ ప్రతినిధి తాజాగా ఈ మెయిల్ పంపించారు.అమెజాన్ అంతకు ముందు 2021 జనవరి వరకే ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించింది. దీన్ని ప్రస్తుతం వచ్చే ఏడాది జూన్ 30వరకు పొడిగించింది. 


యూఎస్ లో ఆన్ లైన్ రిటైలర్ సంస్థ అయిన అమెజాన్ లో పనిచేస్తున్న 19వేల మంది ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా మహమ్మారి సమయంలో అమెజాన్ గిడ్డంగులను తెరిచి ఉంచడం  వల్ల ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఉద్యోగులు చెప్పారు. సామాజిక దూరం పాటించడం, థర్మల్ తనిఖీుల చేయడం, ఫేస్ మాస్కులు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లు వాడటం వల్ల తాము సురక్షితంగా ఉన్నామని అమెజాన్ ప్రతినిధి చెప్పారు. ఫేస్ బుక్ వచ్చే ఏడాది జులై వరకు. గూగుల్ కార్యాలయంలో వచ్చే ఏడాది జూన్ వరకు వర్కు ఫ్రం హోంకు అనుమతి ఇచ్చింది.

Updated Date - 2020-10-21T14:11:17+05:30 IST