Covishield కువైట్‌లోనూ ఆమోదం పొందిన టీకా: భారత రాయబారి

ABN , First Publish Date - 2021-07-11T18:16:07+05:30 IST

భారత్‌లో కోవిషీల్డ్ పేరిట ఉత్పత్తి అవుతున్న కరోనా టీకా అస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ కువైట్‌లోనూ ఆమోదం పొందిందని భారత రాయబారి సిబి జార్జ్ స్పష్టం చేశారు.

Covishield కువైట్‌లోనూ ఆమోదం పొందిన టీకా: భారత రాయబారి

కువైట్ సిటీ: భారత్‌లో కోవిషీల్డ్ పేరిట ఉత్పత్తి అవుతున్న కరోనా టీకా అస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ కువైట్‌లోనూ ఆమోదం పొందిందని భారత రాయబారి సిబి జార్జ్ స్పష్టం చేశారు. తాజాగా స్థానిక మీడియాతో మాట్లాడిన రాయబారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అస్ట్రాజెనెకా టీకాను భారత్‌లో సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2లక్షల డోసుల కోవిషీల్డ్ టీకాలను కువైట్‌కు భారత్ పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేగాక భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీగా పరిగణిస్తారని, టీకాల తయారీలోనూ అతిపెద్దదని రాయబారి చెప్పుకొచ్చారు. ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు తిరిగి కువైట్ వచ్చేందుకు తమ పేర్లను ఆరోగ్యశాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని గత నెలలోనే ఆయన సూచించారు.    


Updated Date - 2021-07-11T18:16:07+05:30 IST