Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌ ఆశయాలను సాధించాలి

వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఘన నివాళి

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను సాధించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా మునిసిపల్‌ చైర్‌పర్సన్‌  పెరుమాళ్ల అన్నపూర్ణతో కలిసి సూర్యాపేటలోనిఖమ్మం క్రాస్‌ రోడ్డులో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. పౌరులందరు అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని ధారపోసిన  మహోన్నతుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి దయానందరాణి, జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ జీడి భిక్షం, జుట్టుకొండ సత్యనారాయణ, వై.వెంకటేశ్వర్లు, ఆకుల లవకుశ,  చింతలపాటి చినశ్రీరాములు, రాజయ్య  శ్రీరాములు పాల్గొన్నారు.

దళిత సంఘాల నిరసన

అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమానికి కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఉదయం 9.30లకు రావాల్సి ఉండగా గంట ఆలస్యంగా రావడంతో దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ను కలెక్టర్‌ అవమాన పర్చారంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున కార్యక్రమం నుంచి ప్రజాప్రతినిధులు  వెళ్లిన తర్వాత వచ్చానని  కలెక్టర్‌ బదులిచ్చారు. 

నోట్లో మట్టితో దివ్యాంగుల నిరసన

మోతె: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్వాంగుల నోట్లో  ప్రభుత్వం మట్టికొట్టిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్‌ అన్నారు. మోతెలో నోట్లో మట్టిపోసుకుని దివ్యాంగులు నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం ఎదుట దివ్వాంగులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేష్‌  మాట్లాడారు. గతంలో ఉన్న మాదిరిగా శాఖను కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందో ళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జంజిరాల సుధాకర్‌, పిడమర్తి సైదులు, షేక్‌ హుస్సేన్‌, కొండ సైదులు, తురక నాగమ్మ, భూక్యా సరిత, ఆంగోతు రోజా, బిక్షం, కీసర పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.Advertisement
Advertisement