Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేద్కర్‌కు ఘన నివాళి

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తాంగా సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ సం ఘాల నాయకులు ఘన నివాళి అర్పించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు పూలమాలలు వేశారు. అనంతరం మున్సి పల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణి, గ్రంథాలయం జిల్లా చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ఉపాధ్యక్షులు కొమిరె సంజీవ్‌గౌడ్‌, ఎండీ సత్తార్‌, తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్‌ జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శ ప్రాయమన్నారు. మున్సి పల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు సలీం, నాయకులు ఎల్లయ్య, రమేష్‌, అంజయ్య, మురళి, హరికృష్ణ, వనజ పాల్గొన్నారు.

ఫ తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్‌ నాయకులు  రాములు, శివరాజ్‌,  జగన్‌,  మల్లేశం పాల్గొన్నారు.

ఫ సీపీఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్‌ చౌర స్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.  సీపీఐ జిల్లా కార్య దర్శి వేణు, అజ్జ వేణు, నాయకులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement