Abn logo
Apr 17 2021 @ 00:55AM

‘సాక్షి’పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ముమ్మిడివరం, ఏప్రిల్‌ 16: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రాన్ని సాక్షి ది నపత్రికలో వ్యంగ్యంగా చిత్రీకరించడంపట్ల ముమ్మిడివరంలో టీడీపీ ఎస్సీ సె ల్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అమలాపురం పార్లమెంటు ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ పొద్దోకు నారాయణరావు(బాలు) ఆధ్వర్యంలో పార్టీ కా ర్యాలయంవద్ద శుక్రవారం సాక్షి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. పో లీస్‌స్టేషన్‌లో సీఐ ఎం.జానకిరామ్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గొలకోటి దొరబాబు, టేకుమూడి లక్ష్మణరావు, అర్థాని శ్రీనివాస రావు, దున్నా సత్యనారాయణ, జనిపల్లి సోమన్న, బీర అంబేడ్కర్‌, చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, దాసరి నాగేశ్వరరావు, కాశి సత్యనారాయణ మూర్తి, యాళ్ల ఉదయ్‌, బొంతు నాగరాజు, కాశి లాజర్‌ పాల్గొన్నారు.

‘సాక్షి’ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 16: సాక్షి దినపత్రికలో అంబేడ్కర్‌ చిత్రాన్ని వ్యంగ్యంగా వేయడాన్ని నిరసిస్తూ అంబేడ్కర్‌ ఫాలోవర్స్‌ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో శుక్రవారం నిరసన తెలిపారు. వీసీకే పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు బొంతు వెంకటరమణ, కుల వి వక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పచ్చిమాల వసంతకుమార్‌, బీఎస్పీ నాయకులు వడ్డి వీరాస్వామి, పెయ్యల ప్రతాప్‌, వివిధ యూనియన్ల నాయకులు వి.దొరబాబు, మోకా శ్రీని వాసరావు, మట్టపర్తి నారాయణ, మెండి డేవిడ్‌రాజు, శెట్టిబత్తుల అను పాల్గొన్నారు.

క్షమాపణ చెప్పాలి: దళిత సంఘాల డిమాండ్‌

గోదావరి సిటీ(రాజమహేంద్రవరం), ఏప్రిల్‌ 16: సాక్షి దినపత్రికలో అంబేద్కర్‌ చిత్రపటాన్ని వ్యంగ్యంగా ముద్రించడాన్ని నిరసిస్తూ గోకవరం బస్టాండ్‌ అంబేడ్కర్‌ విగ్రహంవద్ద బీఎస్పీ నాయకుడు ఇసుకపట్ల రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో నక్కా వెంకటరత్నంరాజు, పట్నాల విజయ్‌కుమార్‌, బద్దే జార్జి ఆంటోని, అడ్వకేట్‌ పి.గణేశ్వరరావు, కోనాల లాజర్‌, అద్దాల కుమార్‌బాబు, దారా రత్నం పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement