అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-06T05:30:00+05:30 IST

ప్రతిఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌సీ వెంకటేశ్వర్లు అన్నారు.

అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తున్న ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు, విద్యార్థులు

  1. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు


నంద్యాల, డిసెంబరు 6: ప్రతిఒక్కరూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్‌) ఏడీఆర్‌ డాక్టర్‌ ఎన్‌సీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విద్యార్థులనుద్దేశించి ఏడీఆర్‌ మాట్లాడుతూ  క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పాలిటెక్నిక్‌ విద్యార్థులు పాల్గొన్నారు.  నంద్యాల మున్సిపల్‌ టీడీపీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి బలవంతపు వసూళ్లకు నిరసనగా విగ్రహానికి వినతిపత్రం అందజే శారు. బొమ్మలసత్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాబువలి, కౌన్సిలర్‌ నాగార్జున, ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు కైలాస్‌, మాజీ కౌన్సిలర్‌ దస్తగిరి, నాయకులు తిమ్మ య్య, జయప్రకాష్‌, మఽధు, సోమన్న పాల్గొన్నారు. నంద్యాల కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చింతల మోహన్‌రావు ఆధ్వర్యంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. బొమ్మలసత్రం సర్కిల్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో  కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 


నంద్యాల(నూనెపల్లె): దళితుల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని నంద్యాల ఆర్టీవో కృష్ణారావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆర్టీవో కృష్ణారావు, ఏవో సువర్ణ కుమారి, ఎంవీఐ సునీల్‌, సిబ్బంది పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బీటీఎఫ్‌ కార్యాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి బీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సతీ్‌షకుమార్‌, నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జయపాల్‌, చెన్నయ్య, సంజీవ్‌, మౌళీ బాషా, జయరాజు, శేఖర్‌ పాల్గొన్నారు. 


గడివేముల: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఓటీఎస్‌ను రద్దు చేస్తామని మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. సోమవారం మండలంలోని పెసరవాయి, కరిమద్దెల గ్రామాల్లో ఆత్మగౌరవ సభలను నిర్వహించారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సీతారామిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌రెడ్డి, వడ్డు లక్ష్మీదేవి, సుభద్రమ్మ, చిందుకూరు సర్పంచ్‌ అనసూయమ్మ, కృష్ణయాదవ్‌, ఆచారి పాల్గొన్నారు. 


పాణ్యం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పాణ్యంలో సోమవారం నిర్వహించారు. నంద్యాల డీఎల్పీవో శ్రీనివాసులు, పాణ్యం ఎంపీపీ ఉశేన్‌బీ, ఎంఈవో కోటయ్య, ఎంపీడీవో దస్తగిరి, పంచాయతీ కార్యదర్శి అనూరాధ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మాలమహానాడు, ఏఐఎ్‌ఫబీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థి సంఘం నాయకులు దేవదత్తు, వెంకటాద్రి, శివకృష్ణ యాదవ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రమణయ్య, చందమామ బాబు, కో ఆపరేటి వ్‌ సొసైటీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


చాగలమర్రి: అంబేడ్కర్‌ ఆశయాలు చిరస్మరణీయమని మాల మహాసేన అధ్యక్షుడు భాస్కర్‌ అన్నారు. సోమవారం చాగలమర్రి అడ్డవాగు సమీపంలోగల అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాల మహాసేన గౌరవ సలహాదారుడు చిన్న ఓబులేసు, ఉపాధ్యక్షుడు నాగేష్‌, సభ్యులు ప్రభుకాంత్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


శిరివెళ్ల: బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి   బాలవెంకట రమణ అన్నారు. శిరివెళ్లలోని తెలుగు పేటలో అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సోమవారం నివాళి అర్పించారు. కార్యక్రమంలో సుంకి సత్యం, పెదరాయుడు, పెద్ద లింగమయ్య, నరసింహుడు, సీతమ్మ, రమా ప్రభావతి పాల్గొన్నారు. 


దొర్నిపాడు: స్థానిక బాలుర వసతి గృహం, గ్రంథాలయంలలో సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహిచారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వార్డెన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, గ్రంథాలయాధికారి బెల్తాజార్‌ పాల్గొన్నారు. 


రుద్రవరం: ప్రతిఒక్కరూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కిరన్‌కుమార్‌, సతీష్‌, సురే్‌షకుమార్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-12-06T05:30:00+05:30 IST