ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ రేషన్‌

ABN , First Publish Date - 2021-01-21T06:13:28+05:30 IST

జిల్లాలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాహనాల (మినీ ట్రక్కులు) ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ష్టాత్మకంగా చేపట్టనున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ పేర్కొ న్నారు. దీనికి సంబంధించిన వాహనాలను గురువారం పంపిణీ చేయనున్నారు.

ప్రతిష్టాత్మకంగా ఇంటింటికీ రేషన్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

కలెక్టర్‌ నివాస్‌ 

శ్రీకాకుళం రూరల్‌, జనవరి 20: జిల్లాలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాహనాల (మినీ ట్రక్కులు) ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ష్టాత్మకంగా చేపట్టనున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ పేర్కొ న్నారు. దీనికి సంబంధించిన వాహనాలను గురువారం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు 534 మంది వాహనదారులకు స్థానిక బాపూజీ కళామందిర్‌లో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. కలెక్టర్‌ నివాస్‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ‘జిల్లాలో రేషన్‌ తీసుకునే ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాహనదారులపై ఉంది. గురువారం నుంచి ప్రతి వాహనదారుడు తన పరిధిలోని గ్రామాలను సంద ర్శించాలి. వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ చేసే విధానంపై ముందుగా కార్డుదారులకు తెలియ జేయాలి. సంబంధిత తహసీల్దార్‌, ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్‌, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి, గ్రామ సచివాలయ సంక్షేమ సహా యకులు, వలంటీర్లతో పరిచయాలు పెంచుకోవాలి. వారికి ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి. వాహనాలను సొంత పనులకు వినియోగించకూడదు. ఎక్కడపడితే అక్కడ నిలిపివేయరాదు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి’ అని కలెక్టర్‌ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జేసీ సుమిత్‌కుమార్‌, సహాయ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకుడు రామారావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఎ.కృష్ణారావు, పౌరసరఫరాల అధికారి డీవీ రమణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T06:13:28+05:30 IST