Abn logo
Apr 27 2021 @ 23:29PM

పీపీఈ కిట్ వేసుకొని డ్యాన్స్.. బారాత్‌లో హల్‌చల్ చేసిన అంబులెన్స్ డ్రైవర్

డెహ్రాడూన్: పెళ్లి బారాత్‌లో కుర్రాళ్లు డ్యాన్సులు చేస్తారనే విషయం తెలుసు కదా. మరి ఈ కరోనా టైంలో ఎలా డ్యాన్సులు చేయాలి? అని ఆలోచించే వారికి ఒక అంబులెన్సు డ్రైవర్ కొత్త ఆలోచన అందించాడు. అదేంటంటే.. పీపీఈ కిట్ ధరించి డ్యాన్స్ చేయడం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఒక అంబులెన్సు డ్రైవర్ పీపీఈ కిట్ ధరించి, పెళ్లి బారాత్‌లో చిందులు తొక్కాడు. ఇలా డ్యాన్సులు చేయడం గురించి అతను మాట్లాడుతూ.. ఈ కరోనా పరిస్థితుల్లో తాను 18 గంటలపాటు ఉద్యోగం చేస్తూనే ఉన్నానని, మనసు ఆహ్లాదం కోసం ఇలా బారాత్‌లో డ్యాన్స్ వేశానని చెప్పాడు.

Advertisement
Advertisement