కాసుల కక్కుర్తితో రోగుల ప్రాణాలకు బేరం పెడుతున్న అంబులెన్స్ డ్రైవర్లు

ABN , First Publish Date - 2021-05-12T17:34:35+05:30 IST

కొందరు అంబులెన్స్ డ్రైవర్లు కాసుల కక్కుర్తితో రోగుల ప్రాణాలకు బేరం పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాసుల కక్కుర్తితో రోగుల ప్రాణాలకు బేరం పెడుతున్న అంబులెన్స్ డ్రైవర్లు

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ప్రైవేటు అంబులెన్సు డ్రైవర్లు ప్రాణాలకు లెక్కచేయకుండా రోగులను ఆస్పత్రులకు తరలిస్తూ ఎన్నో ప్రాణాలు కాపాడుతున్నారు. కొన్ని సందర్భాలలో కోవిడ్ మృత దేహాలను శ్మశాన వాటికకు తీసుకువెళుతున్నారు. స్వయంగా కిందికి దించుతున్నారు. అయితే ఇంత కష్టకాలంలో కూడా కొందరు అంబులెన్స్ డ్రైవర్లు కాసుల కక్కుర్తితో రోగుల ప్రాణాలకు బేరం పెడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


వాస్తవానికి ఎంత దూరానికి ఎంత తీసుకోవాలో అంబులెన్స్ నిర్వాహకులకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం మూడు విభాగాల్లో నిర్ణయించిన ధరల ప్రకారం 10 కి.మీ. వరకు రూ. 1500, 10 కి.మీ. దాటితే రూ. 1600, బేసిక్ లైఫ్ సపోర్టు అంబులెన్స్ 10 కి.మీ. వరకు రూ. 2వేలు, ఆ పైన అయితే రూ. 2100. అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్టు అంబులెన్స్ 10 కి.మీ. వరకు రూ. 4వేలు, 10 కి.మీ. దాటితే రూ. 4100 అని ధర నిర్ణయించారు. వాటికి మించి అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. అంబులెన్స్ డ్రైవర్ లైసెన్స్‌తోపాటు అంబులెన్స్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా రద్దు చేస్తామంది.


ప్రభుత్వాలు నిర్ణయించిన ధరలు కాకుండా అదనంగా వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబులెన్స్ డ్రైవర్లు కొందరు డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధానిలో ఇటీవల ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుడు గురుగ్రామ్ నుంచి పంజాబ్‌లోని లుథియానాకు రూ. లక్షా 20వేలు వసూలు చేసిన తీరును ఖండించారు. కేవలం ఢిల్లీలోనే కాదు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నిర్ణయించినప్పటికీ వాటిని అనుసరిస్తున్నవారి సంఖ్య తక్కువే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-05-12T17:34:35+05:30 IST