ఆంధ్రా మెడికల్‌ కాలేజీలోవైట్‌ కోడ్‌ డే

ABN , First Publish Date - 2021-03-06T07:31:18+05:30 IST

ఆంధ్ర వైద్య కళాశాలలో వైట్‌కోట్‌ వేడుకను శుక్రవారం నిర్వహించారు. ప్రతి విద్యార్థి వైద్యునిగా భావించి యాఫ్రాన్‌ (వైట్‌కోట్‌)ను ధరిస్తారు.

ఆంధ్రా మెడికల్‌ కాలేజీలోవైట్‌ కోడ్‌ డే
వైట్‌కోట్‌ వేడుకలో పాల్గొన్న విద్యార్థులు, బోధనా సిబ్బంది

సందడి చేసిన విద్యార్థులు

మహారాణిపేట, మార్చి 5: ఆంధ్ర వైద్య కళాశాలలో వైట్‌కోట్‌ వేడుకను శుక్రవారం నిర్వహించారు. ప్రతి విద్యార్థి వైద్యునిగా భావించి యాఫ్రాన్‌ (వైట్‌కోట్‌)ను ధరిస్తారు. ఈ సందర్భంగా ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ ఆధ్వర్యంలో కళాశాల 98వ బ్యాచ్‌ విద్యార్థులతో వేడుక నిర్వహించారు.


ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్‌ఏడీఎం డాక్టర్‌ రాహుల్‌రాయ్‌ మాట్లాడుతూ వైద్య విద్యలో సాంకేతిక అభివృద్ధి, రోగుల పట్ల వ్యవహరించాల్సిన విధానం, వైద్య విద్యలో తీసుకోవాల్సిన మెలకువలు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎ.భాగ్యలక్ష్మి, డాక్టర్‌ దేవీమాధవి, డాక్టర్‌ పి.ఎస్‌.ఎన్‌.రాజు తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-03-06T07:31:18+05:30 IST