Abn logo
Oct 24 2021 @ 23:44PM

ఉండి ఏఎంసీ డైరెక్టర్‌ కృష్ణారావు ఆకస్మిక మృతి

ఉండి ఏఎంసీ డైరెక్టర్‌ కృష్ణారావు

ఉండి, అక్టోబరు 24 :మాజీ సర్పంచ్‌, ఉండి మార్కెట్‌ యార్డు డైరక్టర్‌ కానుబోయిన కృష్ణారావు (62) ఆది వారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతిచెం దారు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కృష్ణారావు గతంలో కలిసి పూడి సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు,ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించారు. సత్యనారాయణ ఉండి వైసీపీ ఇన్‌చార్జు గోకరాజు రామరాజు, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు, ఏఎం సీ చైర్మన్‌ చింతలపాటి ప్రభావతి వెంకట్రాజు, వైస్‌ చైర్మన్‌ బొత్సా అచ్చారావు, సర్పంచ్‌ కేశబోయిన జానకి దంపతులు, ఎంపిపి హరిబాబు, జడ్పీటీసీ రణస్థుల కనక దుర్గ మహంకాళితదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.