Abn logo
Oct 14 2021 @ 07:16AM

Ameerpet, SR Nagar‎లో గంజాయి ముఠా అరెస్ట్

హైదరాబాద్: నగరంలోని ఎస్.ఆర్.నగర్, అమీర్‎పేట్‎లో టాస్క్ ఫోర్స్ గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారుగా 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 6 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...