అమెరికా డిస్‌క్వాలిఫై..అలీసన్‌కు షాక్‌

ABN , First Publish Date - 2021-07-31T08:46:26+05:30 IST

అమెరికా స్టార్‌ స్ర్పింటర్‌ అలీసన్‌ ఫెలిక్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగలింది. ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాలన్న ఆమె స్వప్నం చెదిరింది.

అమెరికా డిస్‌క్వాలిఫై..అలీసన్‌కు షాక్‌

టోక్యో: అమెరికా స్టార్‌ స్ర్పింటర్‌ అలీసన్‌ ఫెలిక్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగలింది. ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాలన్న ఆమె స్వప్నం చెదిరింది. కారణం..శుక్రవారం జరిగిన 4్ఠ400 మీ. మిక్స్‌డ్‌ రిలే విభాగం నుంచి డిఫెండింగ్‌ చాంపియన్‌, హాట్‌ఫేవరెట్‌ అమెరికా డిస్‌క్వాలిఫై కావడమే. హీట్స్‌కు అలీసన్‌ దూరంగా ఉండగా ఎలిజా గాడ్విన్‌, లినా ఇర్బీ, టేలర్‌ మాన్సన్‌, బ్రైస్‌ డీడ్మన్‌ బరిలోకి దిగారు. అయితే అనుమతించిన జోన్‌కు వెలుపల బ్యాటన్‌ మార్చుకోవడంతో అమెరికాపై అనర్హత వేటు వేశారు. అదే ఆ జట్టు ఫైనల్‌ చేరివుంటే అలీసన్‌ పోటీపడేది. ఆ క్రమంలో అమెరికా పతకం సాధిస్తే అది విశ్వక్రీడల్లో ఫెలిక్స్‌కు పదోది అయ్యేది. ప్రస్తుతం..35 ఏళ్ల అలీసన్‌ ఆరు స్వర్ణాలు, మూడు రజతాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో జమైకా దిగ్గజ అథ్లెట్‌ మర్లీన్‌ ఓటీ సరసన ఉంది. 

Updated Date - 2021-07-31T08:46:26+05:30 IST