అమెరికాలో 50 ఏళ్ల నాటి భారతీయ పత్రిక మూసివేత

ABN , First Publish Date - 2020-03-30T10:01:52+05:30 IST

ఐదు దశాబ్దాలుగా భారతీయ అమెరికన్లకు సేవలందించిన ‘ఇండి యా అబ్రోడ్‌’ ప్రింట్‌ ఎడిషన్‌ను మూసివేస్తున్నట్లు ఆ పత్రిక యాజమాన్యం ప్రకటించింది. కరోనా కల్లోలంతోపాటు.. యాడ్స్‌ లేకపోవడం కారణమని పేర్కొంది.

అమెరికాలో 50 ఏళ్ల నాటి భారతీయ పత్రిక మూసివేత

  • కరోనాతో యాడ్స్‌ తగ్గడమే కారణం

వాషింగ్టన్‌, మార్చి 29: ఐదు దశాబ్దాలుగా భారతీయ అమెరికన్లకు సేవలందించిన ‘ఇండి యా అబ్రోడ్‌’ ప్రింట్‌ ఎడిషన్‌ను మూసివేస్తున్నట్లు ఆ పత్రిక యాజమాన్యం ప్రకటించింది. కరోనా కల్లోలంతోపాటు.. యాడ్స్‌ లేకపోవడం కారణమని పేర్కొంది. 1970లో ప్రవాస భారతీయుడు గోపాల్‌ రాజు స్థాపించిన ఈ పత్రిక.. 50 ఏళ్లుగా అమెరికాలోని ఎన్నారైల మన్ననలు అందుకుంది. రాజకీయం, వాణిజ్యం, సాంకేతిక త, సాహిత్యం విభాగాల్లో వార్తలను అందించిన ఈ పత్రికను 2011లో రిడిఫ్‌ డాట్‌ కామ్‌ కొనుగోలు చేసింది. 2016లో ‘8కే మైల్స్‌ మిడియా ఇంక్‌’ సంస్థ యాజమాన్య హక్కులు పొందింది. సోమవారం(మార్చి 30) నాడు చివరి ప్రింట్‌ ఎడిషన్‌ను పాఠకులకు అందజేస్తామని, ఆ తర్వాత కేవలం వెబ్‌ ఎడిషన్‌ మాత్రమే కొనసాగుతుందని యాజమాన్యం ప్రకటించింది.

Updated Date - 2020-03-30T10:01:52+05:30 IST