కరోనా మందుకు.. గబ్బిలం ఫార్ములా

ABN , First Publish Date - 2020-07-14T06:26:55+05:30 IST

‘ఎబోలా’ నుంచి ‘కరోనా’ దాకా ఎన్నో వైర్‌సలకు వాహకాలు గా గబ్బిలాలు పనిచేశాయి. అత్యంత ప్రమాదకర వైర్‌సలను మనుషుల దాకా మోసుకొస్తున్నా గబ్బిలాలు మాత్రం ఇన్ఫెక్షన్ల బారినపడటం లేదు...

కరోనా మందుకు.. గబ్బిలం ఫార్ములా

  • వాటి రోగ నిరోధక వ్యవస్థ స్పందనే ప్రామాణికం: అమెరికా


న్యూయార్క్‌, జూలై 13: ‘ఎబోలా’ నుంచి ‘కరోనా’ దాకా ఎన్నో వైర్‌సలకు వాహకాలు గా గబ్బిలాలు పనిచేశాయి. అత్యంత ప్రమాదకర వైర్‌సలను మనుషుల దాకా మోసుకొస్తున్నా గబ్బిలాలు మాత్రం ఇన్ఫెక్షన్ల బారినపడటం లేదు. అవే వైర్‌సలు సోకిన మనుషులు మాత్రం ఎందుకు చనిపోతున్నారో తెలుసుకునేందుకు అమెరికాలోని రోచెస్టర్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వైర్‌సను గుర్తించగానే మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తోంది. గబ్బిలాల్లోని రోగ నిరోధక వ్యవస్థ మాత్రం పరిమితంగా(నిర్ణీత స్థాయిలోనే) స్పందిస్తోంది. వైరస్‌ సంఖ్య పెరగకుండా కట్టడి చేసే ప్రత్యేక వ్యవస్థ గబ్బిలాల్లో క్రియాశీలంగా ఉంది. మనుషులో వైర్‌సను రోగనిరోధక వ్యవస్థ తిప్పి కొట్టే ప్రయత్నం చేయడంతో జ్వరం, వాపులు, ఇతర లక్షణాలు బయటపడుతున్నాయి. వాపులకు కారణమయ్యే పలు జన్యువులు గబ్బిలాల్లో లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషుల్లోని ఈ జన్యువుల స్పందనలను నియంత్రించే ఔషధాల ఉత్పత్తితో కరోనా కట్టడికి అవకాశం ఉందని చెప్పారు. గబ్బిలాలకు ఉన్న ఎగిరే సామర్థ్యం కూడా వాటి శరీరంలో వైరస్‌ వ్యాప్తికి, మనుగడకు అవకాశాలు లేకుండా చేస్తోంది. 


Updated Date - 2020-07-14T06:26:55+05:30 IST