కరోనా టీకా కోసం వృద్ధులుగా మారుతున్న మహిళలు

ABN , First Publish Date - 2021-02-20T17:03:52+05:30 IST

ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్...

కరోనా టీకా కోసం వృద్ధులుగా మారుతున్న మహిళలు

న్యూయార్క్: ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. టీకాలు వేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. అయితే ఇటువంటి విధివిధానాలను బేఖాతరు చేస్తూ పలువురు అక్రమంగా టీకాలు వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలోని ఓర్లాండో నగరానికి చెందిన ఇద్దరు మహిళలు తాము వృద్ధులమని చెప్పుకుని కరోనా టీకా వేయించుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వారిని మందలించి విడిచిపెట్టారు. ఆరెంజ్ కౌంటీ రాష్ట్ర ఆరోగ్య అధికారి డాక్టర్ రౌల్ పినో మాట్లాడుతూ ఇద్దరు మహిళలు టోపీ ధరించి, కళ్లద్దాలు పెట్టుకుని ఆసుపత్రికి వచ్చారని అన్నారు. అలాగే వారు తమ బర్త్ సర్టిఫికెట్ మార్పించుకున్నారన్నారు. ప్రస్తుతం 65 ఏళ్ల పైబడినవారికి టీకాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తున్నందున వారు ఇలా చేశారని భావిస్తున్నామన్నారు. అక్రమంగా టీకా వేయించుకోవాలనుకుంటున్నవారి వయసు 35 నుంచి 45 మధ్యలో ఉంటుందన్నారు. వారిని మందలించి పంపేశామని తెలిపారు. 

Read more