Covid 19 కొత్త కేసులపై WHO షాకింగ్ వివరాలు.. అమెరికా తర్వాత భారతే!

ABN , First Publish Date - 2021-09-02T01:07:27+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో రోజువారీ కొత్త కేసులు భారీగానే నమోదవుతున్నాయి.

Covid 19 కొత్త కేసులపై WHO షాకింగ్ వివరాలు.. అమెరికా తర్వాత భారతే!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో రోజువారీ కొత్త కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గడిచిన 24 గంటల్లో అత్యధిక కొత్త కేసులు నమోదైన దేశాల జాబితాను వెల్లడించింది. ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొంది. ఆగస్టు 30న యూఎస్‌లో ఒకేరోజు 1.81లక్షల కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే ఆగస్టు 30 నాటికి అమెరికాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 631,134 చేరిందని తెలిపింది. 


ఇక డబ్ల్యూహెచ్ఓ సమాచారం ప్రకారం అమెరికా తర్వాత వైరస్ ప్రభావం అధికంగా ఉంది భారత్‌లోనే. సోమవారం ఒకేరోజు ఇండియాలో 49,909 కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్ రెండో స్థానంలో ఉంటే.. మూడు స్థానంలో యూకే ఉంది. అక్కడ గడిచిన 24 గంటల్లో 32,937 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక నాల్గో స్థానంలో ఇరాన్(31,516) ఉంది. వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ వరకు ఆ దేశంలో 4,926,964 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే ఐదో స్థానంలో బ్రెజిల్ ఉంది. అక్కడ ఒకేరోజు 24,699 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇలా ఒకేరోజు అత్యధిక కేసులు నమోదైన జాబితాలో తర్వాతి స్థానాల్లో వరుసగా జపాన్(19,994), ఫిలిప్పీన్స్(18,528 ), రష్యా(18,325), మెక్సికో(18,325) ఉన్నాయి. ఏదేమైనా టీకాల భారీ వినియోగం బాధితుల సంఖ్యను పరిమితం చేసిందని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది.   

Updated Date - 2021-09-02T01:07:27+05:30 IST