అమెరికన్‌ ఫెడరల్‌ మరో భారీ ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-04-10T13:19:34+05:30 IST

కోవిడ్‌-19 ప్రభావం వల్ల అతలాకుతలం అయిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరో 2.3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

అమెరికన్‌ ఫెడరల్‌ మరో భారీ ప్యాకేజీ

వాషింగ్టన్‌: కోవిడ్‌-19 ప్రభావం వల్ల అతలాకుతలం అయిన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరో 2.3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. చిన్న, మధ్య తరహా సంస్థల రుణాల్లో 60 కోట్ల డాలర్ల రుణాలను కొనుగోలు చేసేందుకు మెయిన్‌ స్ర్టీట్‌ లెండింగ్‌ ప్రోగ్రామ్‌ ఈ ప్యాకేజీలో ప్రధానమైనది. ప్రస్తుత సంక్షోభానికి ముందు చక్కని ఆర్థిక స్తోమత కలిగి ఉండి 10 వేల మంది కార్మికులు పని చేస్తున్న సంస్థలను ఎంపిక చేసి వాటికి నాలుగేళ్ల కాలపరిమితి గల రుణాలు అందిస్తారు. అసలు, వడ్డీ చెల్లింపులన్నింటినీ ఒక ఏడాది వాయిదా వేస్తారు. మూడున్నర కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న 40 వేల కంపెనీలకు ఇది లాభం చేకూరుస్తుందని ట్రెజరీ శాఖ మంత్రి ముంచిన్‌ అన్నారు.

Updated Date - 2020-04-10T13:19:34+05:30 IST