BIDENని ఒక్క గుద్దుతో పడగొడతానన్న TRUMP.. నవ్వుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-09-11T22:48:54+05:30 IST

‘బాక్సింగ్ రింగ్‌లో దిగితే.. ఒక్క గుద్దుతో పడగొడతా’ ఈ మాట ఎవరో బాక్సర్‌ తన ప్రత్యర్థితో అన్నట్లుంది కదా.. కానీ కాదు ఈ మాట అన్నది ఓ మాజీ అధ్యక్షుడు. అది కూడా ప్రస్తుతం అధికారంలో..

BIDENని ఒక్క గుద్దుతో పడగొడతానన్న TRUMP.. నవ్వుకుంటున్న నెటిజన్లు

‘బాక్సింగ్ రింగ్‌లో దిగితే.. ఒక్క గుద్దుతో పడగొడతా’ ఈ మాట ఎవరో బాక్సర్‌ తన ప్రత్యర్థితో అన్నట్లుంది కదా.. కానీ కాదు ఈ మాట అన్నది ఓ మాజీ అధ్యక్షుడు. అది కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న అధ్యక్షుడి గురించి. ఇంతటి తిక్క ఉన్న ఆ నేత ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మీరు ఊహించింది నిజమే.. అయన అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.


హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్లు ఇవాండర్ హోలీఫీల్డ్, విటోర్ బెల్‌ఫోర్ట్‌ల మధ్య శనివారం ఓ బాక్సింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమీనోల్ రాక్ కాసినోలో శనివారం ఈ హెవీ వెయిట్ బాక్సింగ్ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ట్రంప్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే ఫైట్‌కు ముందు నిర్వహించే మీడియా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న ట్రంప్‌ను ఓ రిపోర్టర్.. ‘మీరు బాక్సింగ్ రింగ్‌లోకి దిగితే మీ ప్రత్యర్థి ఎవరై ఉండాలని అనుకుంటారు..?’ అని అడిగారు. దీనికి సమాధానంగా.. ‘ఒకవేళ నేను బాక్సింగ్ రింగ్‌లోకి దిగితే నాకు అత్యంత సులభమైన ప్రత్యర్థి జో బైడెన్‌‌‌. రింగ్‌లో నా ముందు బైడెన్‌ కొన్ని క్షణాలు కూడా నిలవలేడు. ఒకే ఒక్క గుద్దుతో అతడిని పడగొడతాన’ని షాకింగ్ కామెంట్స్ చేశారు.


కాగా.. 2018లో బైడెన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. మియామీ యూనివర్సిటీలో జరిగిన ఓ ర్యాలీకి హాజరైన బైడెన్.. మహిళలపై ట్రంప్ చేస్తున్న నీచమైన వ్యాఖ్యలను ఖండించారు. అలాగే ఒకవేళ తామిద్దరం స్కూల్లో ఉండి, అప్పుడు కూడా బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఉంటే చితక్కొట్టే వాడినని బైడెన్ పేర్కొన్నాడు.


ఇదిలా ఉంటే ట్రంప్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఇరు వర్గాల అభిమానులు కూడా రెచ్చిపోతున్నారు. కొంతమంది ఏకంగా బైడెన్, ట్రంప్‌ల ఫోటోలను మార్ఫ్ చేసి బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేస్తున్నట్లు కార్టూన్లు సృష్టించి షేర్ చేస్తున్నారు. ఇక కొంతమంది ట్రంప్‌పై మీమ్స్, జోక్స్‌తో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట వీరిద్దరి బాక్సింగ్ మీమ్స్, జోక్స్ వైరల్ అవుతున్నాయి.



Updated Date - 2021-09-11T22:48:54+05:30 IST