కళ్ల ముందే ఉన్నా అరెస్ట్ చేయలేకపోయారు.. పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి

ABN , First Publish Date - 2021-10-10T00:44:50+05:30 IST

నేరం చేసిన ఓ వ్యక్తి.. అరెస్ట్ కాకుండా ఉండేందుకు చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తుండంతో వాటిని చూ

కళ్ల ముందే ఉన్నా అరెస్ట్ చేయలేకపోయారు.. పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి

ఇంటర్నెట్ డెస్క్: నేరం చేసిన ఓ వ్యక్తి.. అరెస్ట్ కాకుండా ఉండేందుకు చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తుండంతో వాటిని చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. ఇంతకూ ఆ వ్యక్తి ఏం చేశాడు.. నెటిజనం ఎందుకు అంతగా నవ్వుతున్నారనే వివరాల్లోకి వెళితే.. 


అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన రూడీ థామస్ అనే 44ఏళ్ల వ్యక్తి తాజాగా అతడి గాళ్‌ఫ్రెండ్‌, ఆమె తల్లితో  దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో సదరు యువతి, ఆమె తల్లి.. రూడీ థామస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు రూడీ థామస్ ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నట్లు గుర్తించిన రూడీ.. వారి నుంచి తప్పించుకోవడానికి ఇంటిపైకప్పు ఎక్కేశాడు.



అనంతరం ఇంటి పక్కనే ఉన్న చెట్టుపైకి గబగబా పాకేశాడు. ఈ క్రమంలో రూడీ థామస్‌ను చెట్టుపై నుంచి కిందకు రప్పించడానికి పోలీసులు తీవ్రంగా కృషి చేశారు. ఎంతగా నచ్చజెప్పినా అతడు పోలీసుల మాటను వినిపించుకోలేదు. ఈ క్రమంలో సుమారు రెండు రోజులపాటు అతడు చెట్టుపైనే గడిపాడు. 48 గంటల తర్వాత కిందకు దిగిన రూడీ థామస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. మానసిక సమస్యలతో అతడు ఇబ్బంది పడుతున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. రూడీ థామస్ చెట్టుపై ఉన్న సమయంలో స్థానికులు అతడి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో రూడీ థామస్ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 




Updated Date - 2021-10-10T00:44:50+05:30 IST