పిల్ల ప‌క్షుల‌కు డాన్స్ నేర్పుతున్న‌ త‌ల్లి ప‌క్షి‌!

ABN , First Publish Date - 2020-08-12T17:59:16+05:30 IST

ఒక ప‌క్షి త‌న పిల్ల‌ల‌ను సాకే దృశ్యం కంట‌ప‌డితే... ఎవ‌రైనా స‌రే అలా చూస్తూనే ఉండిపోతారు. వారికి అది ఒక అద్భ‌త దృశ్యంలా క‌నిపిస్తుంది. త‌ల్లి ప‌క్షి పిల్ల ప‌క్షుల‌కు ఆహారాన్ని అందించ‌డం చూసిన‌వారెవ‌రైనా దానిని జీవితాంతం గుర్తుంచుకుంటారు.

పిల్ల ప‌క్షుల‌కు డాన్స్ నేర్పుతున్న‌ త‌ల్లి ప‌క్షి‌!

ఒక ప‌క్షి త‌న పిల్ల‌ల‌ను సాకే దృశ్యం కంట‌ప‌డితే... ఎవ‌రైనా స‌రే అలా చూస్తూనే ఉండిపోతారు. వారికి అది ఒక అద్భ‌త దృశ్యంలా క‌నిపిస్తుంది. త‌ల్లి ప‌క్షి పిల్ల ప‌క్షుల‌కు ఆహారాన్ని అందించ‌డం చూసిన‌వారెవ‌రైనా దానిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. త‌ల్లి ప‌క్షి త‌న‌ పిల్ల ప‌క్షుల‌కు ఆహారాన్ని అందించ‌డ‌మే కాదు.. వాటికి డాన్స్ కూడా నేర్పిస్తుంద‌ని మీకు తెలుసా? ఇది నిజ‌మ‌నిపించేలాంటి వీడియో ఒక‌టి ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక ప‌క్షి వ‌య్యారంగా ఊగుతూ, త‌న పిల్ల ప‌క్షుల‌కు అద్భుత‌మైన డాన్స్ నేర్పిస్తోంది. బ్యూటెంగేబీడెన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక‌ అమెరికన్ వుడ్‌కాక్‌ తన పిల్లలకు ఏదో నేర్పుతుండ‌గా, అవి త‌ల్లి ఎలా చెబుతోందో అలానే చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఎంతో ముచ్చ‌ట‌ప‌డిపోతున్నారు. ఆ ప‌క్షుల వ‌య్యార‌మైన‌ క‌ద‌లిక‌ల‌కు అనుగుణంగా ఈ వీడియోలో మ్యూజిక్‌ను కూడా జ‌త‌చేర్చారు. 



Updated Date - 2020-08-12T17:59:16+05:30 IST