Abn logo
Aug 4 2020 @ 22:10PM

ప్రాణాలకు తెగించి చెల్లిని కాపాడిన సాహసబాలుడు.. రాఖీ పండుగ జరుపుకుని..

వ్యోమింగ్: అమెరికాకు చెందిన బ్రిడ్జర్ అనే ఆరేళ్ల బాలుడు జూలై 9వ తేదీన ప్రాణాలకు తెగించి కుక్క నుంచి తన నాలుగేళ్ల చెల్లెలి ప్రాణాలను కాపాడి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. ఆ పోరాటంలో ఎవరి ప్రాణాలైనా పోతే.. అవి తనవే కావాలంటూ బ్రిడ్జర్ చెప్పాడని అతడి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. కాగా.. తన ప్రాణాలు కాపాడిన అన్నకు తాజాగా చెల్లెలు రాఖీ కట్టింది. రాఖీ కడుతున్న ఫొటోను బ్రిడ్జర్ బంధువు అయిన నికోల్ వాకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నిజానికి రక్షాబంధన్ పండుగను హిందూ మతస్థులు మాత్రమే జరుపుకుంటారు. అయితే అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రానికి చెందిన బ్రిడ్జర్ కథ భారత్‌తో పాటు ప్రపంచదేశాలకు కూడా వెళ్లిపోయిందని.. ఎన్నో దేశాలకు చెందిన వారు బ్రిడ్జర్‌పై ప్రేమ కురిపించారని నికోల్ వాకర్ చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తమకు రక్షాబంధన్ ప్రాముఖ్యత గురించి తెలిసినట్టు నికోల్ వాకర్ చెప్పింది. ఒకరిని ఒకరు రక్షిస్తామని, అండగా ఉంటామని చెబుతూ జరుపుకునే రాఖీ పండుగ తనకు ఎంతగానో నచ్చిందని, తాము కూడా జరుపుకోవాలని అనుకున్నామని తెలిపింది. ఇదే సమయంలో బ్రిడ్జర్‌కు తన నాలుగేళ్ల చెల్లి రాఖీ కడుతున్న ఫొటోను పోస్ట్ చేసినట్టు నికోల్ వాకర్ పేర్కొంది. కాగా.. కుక్క నుంచి చెల్లెలిని కాపాడే సమయంలో బ్రిడ్జర్ ముఖానికి అనేక గాయాలయ్యాయి. వైద్యులు బ్రిడ్జర్ ముఖానికి 90 కుట్లు వేశారు.

Advertisement
Advertisement
Advertisement