అమెజాన్ డిస్కౌంట్...

ABN , First Publish Date - 2020-10-30T18:54:44+05:30 IST

షాపింగ్ పై అమెజాన్ సంస్థ తన కస్టమర్లకు పలు తగ్గింపు ఆఫర్లనందిస్తోంది. క్రెడిట్/డెబిట్ కార్డు పై ఈ మేరకు ప్రయోజనాలను పొందవచ్చు. రూ. 1,500 వరకు తగ్గింపు పొందే అవకాశముంది. ఇక... ఆయా ప్రొడక్టులపై నేరుగా డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలకు కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గివింగ్ హ్యాపినెస్ డేస్ సేల్ ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... ఆయా ఆఫర్లు తెరమీదకు వచ్చాయి.

అమెజాన్ డిస్కౌంట్...

ముంబై : షాపింగ్ పై అమెజాన్ సంస్థ తన కస్టమర్లకు పలు తగ్గింపు ఆఫర్లనందిస్తోంది. క్రెడిట్/డెబిట్ కార్డు పై ఈ మేరకు ప్రయోజనాలను పొందవచ్చు. రూ. 1,500 వరకు తగ్గింపు పొందే అవకాశముంది. ఇక... ఆయా ప్రొడక్టులపై నేరుగా డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలకు కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గివింగ్ హ్యాపినెస్ డేస్ సేల్ ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... ఆయా ఆఫర్లు తెరమీదకు వచ్చాయి. 


క్రెడిట్/డెబిట్ కార్డు ఆఫర్లతోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటివి కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రూపే కార్డు కలిగిన వారు 10 శాతం తక్షణ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇక అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి 5 శాతం వరకు తగ్గింపును సొంతమవుతుంది. 


సిటీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు నేరుగానే రూ. 1,500 వరకు తగ్గింపును పొందవచ్చు. అదే సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ డెబిట్ కార్డు వాడే వారు కూడా ఇదే ప్రయోజనాన్ని పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు కలిగిన వారు రూ. 750 వరకు తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారు రూ. 750 వరకు తగ్గింపుతోపాటు 3 శాతం అదనపు రివార్డు పాయింట్లను సైతం సొంతం చేసుకోవచ్చు.


ఇక రూపే డెబిట్/ క్రెడిట్ కార్డు ఉపయోగించే వారు రూ. 250 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు... ఈఎంఐ చెల్లింపులపై కూడా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ఆఫర్లు వర్తించేలా వెసులుబాటు కల్పించడం గమనార్హం. 

Updated Date - 2020-10-30T18:54:44+05:30 IST