Abn logo
Sep 24 2021 @ 19:36PM

అమెజాన్‌లో ఆఫర్ల జోరు...

హైదరాబాద్ : పండుగ సీజన్ నేపధ్యంలో... ఈ -కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పలు ఆఫర్లను అందించనుంది. ఈ క్రమంలో... ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది కూడా. అక్టోబరు 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్‌ నిర్వహించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. డీల్స్‌ను ముందుగానే అందుకునే అవకాశం  ప్రైమ్‌ మెంబర్లకు ఉంటుందని తెలిపింది.ఆఫర్లలో భాగంగా... మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ట్యాబ్లెట్ పీసీలు , ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ టీవీలు వంటి వాటిపై అమెజాన్‌ భారీ తగ్గింపులతో అందించనుంది. అమెజాన్‌ ఎకో, ఫైర్‌ స్టిక్‌, కిండ్లే డివైజ్‌లనూ తక్కువ ధరకే అందించనుంది. మరోవైపు... ఆపిల్‌, ఆసుస్‌, ఫాజిల్‌, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్‌, శాంసంగ్‌, సోనీ, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను ఈ సేల్‌లో భాగంగా లాంచ్‌ చేయనున్నారు. ప్రముఖ ఇ-కామర్స్‌ సైట్లలో అమెజాన్ పోటీదారు ఫ్లిప్‌కార్ట్‌ కూడా పండుగ ఆఫర్లతో దూసుకు వస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ను నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.