ఉగ్రవాద సంస్థ పార్లమెంటు ఘెరావ్ హెచ్చరిక... భద్రత కట్టుదిట్టం...

ABN , First Publish Date - 2021-11-29T16:20:32+05:30 IST

నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)

ఉగ్రవాద సంస్థ పార్లమెంటు ఘెరావ్ హెచ్చరిక... భద్రత కట్టుదిట్టం...

న్యూఢిల్లీ : నిషేధిత ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) పార్లమెంటు హౌస్‌ను ఘెరావ్ చేసే అవకాశం ఉందని, పార్లమెంటు భవనంపై ఖలిస్థాన్ జెండాను ఎగురవేసే అవకాశం ఉందని నిఘా సమాచారం రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సంస్థ కౌన్సిల్ జనరల్ గుర్‌పత్వంత్ సింగ్ పన్ను యూట్యూబ్‌లో ఓ వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. 


పన్ను విడుదల చేసిన వీడియోలో రైతులకు ఓ సందేశం ఉంది. శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటును ఘెరావ్ చేయాలని, ఖలిస్థాన్ జెండాను ఎగురవేయాలని రైతులకు పన్ను పిలుపునిచ్చాడు. పార్లమెంటు భవనంపై ఖలిస్థానీ జెండాను ఎగురవేసిన వ్యక్తికి 1,25,000 డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించాడు. 


ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంబంధిత వ్యవస్థలన్నిటినీ హెచ్చరించాయి. ఢిల్లీ పోలీసులతో సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపాయి. పార్లమెంటు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపాయి. 


పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతాయి. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 23 వరకు జరుగుతాయి. 


Updated Date - 2021-11-29T16:20:32+05:30 IST