Omicron variant కేసుల పెరుగుదలతో ఆపిల్ స్టోర్ల మూసివేత

ABN , First Publish Date - 2021-12-28T15:04:02+05:30 IST

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒమైక్రాన్ వేరియెంట్ విజృంభిస్తుండటంతో న్యూయార్క్ నగరంలోని 7 ఆపిల్ రిటైల్ స్టోర్లను మూసివేశారు....

Omicron variant కేసుల పెరుగుదలతో ఆపిల్ స్టోర్ల మూసివేత

న్యూయార్క్ : యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒమైక్రాన్ వేరియెంట్ విజృంభిస్తుండటంతో న్యూయార్క్ నగరంలోని 7 ఆపిల్ రిటైల్ స్టోర్లను మూసివేశారు. ఈ నెల ప్రారంభంలో అమెరికాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరగడంతోపాటు ఆపిల్ స్టోర్ల ఉద్యోగులకు కరోనా సోకడంతో వీటిని మూసివేస్తూ ఆపిల్ నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా దేశాల్లో 10 యాపిల్ స్టోర్లను మూసివేశామని ఆపిల్ తెలిపింది. వినియోగదారులు ఆన్‌లైన్ ఆర్డర్‌లను తీసుకోవచ్చని ఆపిల్ ప్రతినిధి తెలిపారు.మూసివేసిన దుకాణాలలో ఫిఫ్త్ అవెన్యూ, గ్రాండ్ సెంట్రల్, సోహోలో అవుట్‌లెట్‌లు ఉన్నాయి.ఆపిల్ తన యూఎస్ రిటైల్ స్టోర్లలో వినియోగదారులు, ఉద్యోగులందరూ మాస్క్‌లు ధరించాలని కూడా ఆపిల్ సంస్థ ఆదేశించింది.ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆపిల్ తోపాటు పలు ప్రధాన కంపెనీలు కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేశాయి, 


Updated Date - 2021-12-28T15:04:02+05:30 IST