భయంలో అగ్రరాజ్యం.. రాజధానిలో పహారా కాసే పనిలో మిలటరీ!

ABN , First Publish Date - 2021-01-26T11:30:39+05:30 IST

అమెరికా రాజధాని వాషింగ్టన్ భయం గుప్పిట్లో ఉంది. ఈ నెల 6వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నిక సమయంలో యూఎస్ కాపిటోల్‌ లోపలికి చాలా మంది ట్రంప్ మద్దతు దారులు దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణమంటూ..

భయంలో అగ్రరాజ్యం.. రాజధానిలో పహారా కాసే పనిలో మిలటరీ!

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ భయం గుప్పిట్లో ఉంది. ఈ నెల 6వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ ఎన్నిక సమయంలో యూఎస్ కాపిటోల్‌ లోపలికి చాలా మంది ట్రంప్ మద్దతు దారులు దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే కారణమంటూ.. యూఎస్ కాంగ్రెస్ ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకొచ్చింది. దీనిపై ఫిబ్రవరి 8 నుంచి మరోసారి చర్చ జరగబోతోంది. ఇలాంటి తరుణంలో మరోసారి కాపిటోల్ వంటి ఘర్షణ జరిగే అవకాశం ఉందని ఎఫ్‌బీఐ నుంచి సమాచారం అందిందట ఆర్మీకి. దీంతో ఘర్షణల సమయంలో రాజధాని వాషింగ్టన్‌లో దింపిన నేషనల్ గార్డ్స్‌ను వెంటనే వెనక్కు తీసుకెళ్లకూడదని ఆర్మీ భావిస్తోంది. ఈ ఉద్రిక్తతల నడుమే బైడెన్ ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఈ సమయంలోభద్రత కోసం దాదాపు 25వేల మంది నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దింపారు.

Updated Date - 2021-01-26T11:30:39+05:30 IST