Jul 23 2021 @ 18:59PM

ఆమిర్‌ఖాన్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఆడారు!

ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లఢక్ లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఆయనది ఆర్మీ అధికారి పాత్ర. తెలుగు హీరో నాగచైతన్య పోషించేది కూడా అలాంటి పాత్రే. గత రెండు వారాలుగా పర్వతశ్రేణుల్లో ఆర్మీ సాహసాలను ప్రతిబింబించేలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బిజీ షెడ్యూల్‌ మధ్యలో కాస్త రిలాక్స్‌ అవ్వడం కోసం టేబుల్‌ టెన్నిస్‌ ఆడారు. షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశంలో యూనిట్‌ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక టోర్నమెంట్‌ ఏర్పాటు చేశారు. అందులో ఆమిర్‌ నుంచి చిన్నపిల్లలు, పెద్దల వరకూ పాల్గొన్నారు. టెన్నిస్‌ పోటీలు సరదాగా జరిగాయని యూనిట్‌ సభ్యులు తెలిపారు.