ప్రధాని సలహాదారుగా అమిత్‌ ఖరే

ABN , First Publish Date - 2021-10-13T06:55:26+05:30 IST

ప్రధాని మోదీ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అమిత్‌ ఖరే నియమితులయ్యారు. భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఆయన రెండేళ్లపాటు ప్రధాని కార్యాలయంలో

ప్రధాని సలహాదారుగా అమిత్‌ ఖరే

న్యూఢిల్లీ, అక్టోబరు 12: ప్రధాని మోదీ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అమిత్‌ ఖరే నియమితులయ్యారు. భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాలో ఆయన రెండేళ్లపాటు ప్రధాని కార్యాలయంలో సలహాదారు విధులు నిర్వర్తిస్తారు. 1985బ్యాచ్‌ జార్ఖండ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఖరే.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా గత నెల(సెప్టెంబరు) 30న ఉద్యోగ విరమణ చేశారు. కాగా.. సంచలన విజయాలను ఆయన సర్వీసు ఖాతాలో వేసుకొన్నారు. నూతన విద్యా విధానం(ఎన్‌ఈపీ).. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఇంటర్మీడియటరీ గైడ్‌లైన్స్‌, డిజిటల్‌ మీడియా ఎథిక్స్‌ కోడ్‌) రూల్స్‌-2021  రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. 1995-97 మధ్య బిహార్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు రూ.వెయ్యికోట్ల పశుగ్రాస కుంభకోణాన్ని వెలికితీయడంలో కూడా ప్రధాన భూమిక వహించారు. ఈ కుంభకోణంలోనే లాలు ప్రసాద్‌ యాదవ్‌ సీఎం పదవి కోల్పోయి.. జైలుకు వెళ్లారు.

Updated Date - 2021-10-13T06:55:26+05:30 IST